రైల్వే కోడూరులో ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ పాత్రికేయులు పైసాని కిరణ్ కుమార్
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ కేంద్రంలోని పోలింగ్ నెంబర్ 26 కేంద్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి స్థానిక సీనియర్ పాత్రికేయులు పైసాని కిరణ్ కుమార్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్లు ఎవరి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ తీర్పును ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును నిర్భయంగా చాటుకుంటున్నారు.
Andhra
రైల్వే కోడూరులో ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ పాత్రికేయులు పైసాని కిరణ్ కుమార్
Quick Summary:
రైల్వే కోడూరులో ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ పాత్రికేయులు పైసాని కిరణ్ కుమార్