విజయ సంకేతం శుభాల హేల–
శుభాకాంక్షలు తెలిపిన గడ్డం గడ్డం చంగల్ రాజు
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
కాలచక్రం తిరిగిన కొద్దీ ఆశ్వయుజ మాసాన వీచే పవనాలు కొత్త ఆశల పరిమళాలను మోసుకొస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయం, అధర్మంపై ధర్మం పొందిన గెలుపుకు సజీవ సాక్ష్యంగా నిలిచే విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం చెంగలరాజు ఆకాంక్షించారు. ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా ప్రజలకు, ప్రత్యేకించి రైల్వేకోడూరు నియోజకవర్గ ముద్దుబిడ్డలకు, పార్టీ శ్రేణులకు ఆయన హృదయపూర్వక దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు, తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే ఈ విజయదశమి మహోత్సవం ప్రతీ ఇంట్లోనూ సంతోషాల సిరులు కురిపించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టాల కడలి దాటి, అభివృద్ధి, సంక్షేమాల దిశగా జిల్లా సమాజం అడుగులు వేయాలని, శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో, దుర్గామాత కరుణాకటాక్షాలతో ప్రజలంతా నిత్యం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సమాజంలోని సకల జనులకు ఈ పండుగ శుభ ఫలితాలను, విజయాలను చేకూర్చాలని చెంగలరాజు ఆకాంక్షను చాటారు.
Andhra
విజయ సంకేతం శుభాల హేల– శుభాకాంక్షలు తెలిపిన గడ్డం గడ్డం చంగల్ రాజు
Quick Summary:
విజయ సంకేతం శుభాల హేల– శుభాకాంక్షలు తెలిపిన గడ్డం గడ్డం చంగల్ రాజు