రాజంపేట ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలకు శ్రేణులు కదిలిరావాలి: మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు పిలుపు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 10 జై భీమ్ వాయిస్ టుడే:
రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 11వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు కోడూరు నియోజకవర్గ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సంబరాలకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యుడు కోరమట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో భాగంగా కోరమట్ల శ్రీనివాసులు సమక్షంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీహెచ్ రమేష్ బాబు కోరారు.
Andhra
రాజంపేట ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలకు శ్రేణులు కదిలిరావాలి: మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు పిలుపు
Quick Summary:
రాజంపేట ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలకు శ్రేణులు కదిలిరావాలి: మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు పిలుపు