వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైకాపా రాష్ట్ర నాయకులు
రైల్వేకోడూరు సెప్టెంబర్ 25 జై భీమ్ వాయిస్ టుడే:
తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైకాపా రాష్ట్ర నిర్వహణ మండలి సభ్యుడు, మండల అధ్యక్షుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలతో పాటు, రామిరెడ్డి ధ్వజారెడ్డి తన సొంత నిధులతో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఈ సేవా కార్యక్రమాలను, పార్టీ తరఫున చేపడుతున్న చర్యలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంతో పనిచేయాలని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో గల్ఫ్ సలహాదారు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, నవీన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Andhra
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైకాపా రాష్ట్ర నాయకులు
Quick Summary:
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైకాపా రాష్ట్ర నాయకులు


