*జైభీమ్ వాయిస్ టుడే న్యూస్ నందిగామ, అక్టోబర్ 11:*
మైత్రి సేవా సమితి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి 100 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం 50 మందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం శంకర కంటి ఆసుపత్రి వైద్యులు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా మైత్రి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుండాల బాలాజీ మాట్లాడుతూ, ప్రతి నెల రెండవ ఆదివారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం అనాసాగరం తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపికృష్ణ మాట్లాడుతూ, ఖరీదైన కంటి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న మైత్రి సేవా సమితి అధ్యక్షులు గుండాల బాలాజీకి, శంకర కంటి ఆసుపత్రి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా పలువురికి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఆపరేషన్ల కోసం 50 మందిని ఎంపిక చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Andhra
మైత్రి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Quick Summary:
మైత్రి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం