గురువులపై దాడులు హేయమైన చర్య: గడ్డం చెంగల్ రాజు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 28 జై భీమ్ వాయిస్ టుడే:
సమాజానికి నైతిక దిశానిర్దేశం చేసే ఉపాధ్యాయులపై జరిగిన భౌతిక దాడులు అరాచకానికి పరాకాష్ట అని, ఇటువంటి హేయమైన చర్యలను సమాజం ఎంతమాత్రం సహించదని తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం చంగల్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పే గురువులపై రౌడీ మూకలు తెగబడటం తీవ్ర విచారకరమని, దాడికి పాల్పడిన అరాచక శక్తులపై చట్టప్రకారం కఠినమైన కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
క్రీడా కోటా ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులు, అవమానాలపై రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చేసినది ముమ్మాటికీ న్యాయమైనదని పేర్కొన్నారు.
పాఠశాల ఉపాధ్యాయ నియామక పరీక్ష క్రీడా కోటా ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.
నిజాలు తెలుసుకునేందుకు చర్చలకు రాకుండా కేవలం శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే దుర్బుద్ధితోనే కొందరు గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం, యంత్రాంగం నిష్పాక్షికంగా ఉన్నాయని, ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్న అసాంఘిక శక్తులకు ప్రజలే తగిన చెబుతారని హెచ్చరించారు.
Andhra
గురువులపై దాడులు హేయమైన చర్య: గడ్డం చెంగల్ రాజు
Quick Summary:
గురువులపై దాడులు హేయమైన చర్య: గడ్డం చెంగల్ రాజు