పవన్ కళ్యాణ్ జన్మదినం: మంగంపేటలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నేతలు
జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగంపేటలో విరివిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాల్గొని మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కళ్ళ చలపతి, గునిపాటి వేణుగోపాల్, నారదాసు సునీల్, జనసేన నాయకులు లావుళ్ళూరి చరణ్, చేని శివ, గంటా రాజా, లావులూరి రాజేష్‌తో పాటు స్థానిక యువ నాయకులు నారదాసు శివ, చింతల బాలు, పోతల తులసి మరియు భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
పర్యావరణ పరిరక్షణకు సీఎం పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన జనసైనికులు
Quick Summary:
డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంగంపేటలో మొక్కలు నాటిన జనసైనికులు
