జైభీమ్ వాయిస్ టుడే న్యూస్ – నందిగామ, అక్టోబర్ 2:
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నందిగామ సబ్‌జైల్లో న్యాయవాదులు, పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌జైల్లోని ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఆశయాలు, మానవతా విలువలను స్ఫూర్తిగా తీసుకుని ఖైదీల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఖైదీల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.కార్యక్రమంలో నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా, జిల్లా కోర్టు ఏజీపీ బొందలపాటి రామకృష్ణ, మాజీ ఏజీపీ మట్టా ప్రసాద్, సీనియర్ న్యాయవాది మన్నెం నారాయణరావు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నందూరు బాబు విజయసాగర్, నందిగామ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకుపల్లి రామారావు తదితర సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Andhra
గాంధీ జయంతి సందర్భంగా నందిగామ సబ్‌జైల్లో పండ్ల పంపిణీ
Quick Summary:
గాంధీ జయంతి సందర్భంగా నందిగామ సబ్‌జైల్లో పండ్ల పంపిణీ
.jpg)