సమస్యల పరిష్కారానికి 'ప్రజా దర్బార్'హాజరుకానున్న ముక్కా రూపానంద రెడ్డి
రైల్వే కోడూరు సెప్టెంబర్ 17 జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు 'ప్రజా దర్బార్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు రాఘవరాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్, పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ముక్కా రూపానంద రెడ్డి స్వయంగా హాజరై ప్రజల నుండి వినతిపత్రాలను స్వీకరించనున్నారు.
పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ధ్యేయంగా ఈ వేదికను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
Andhra
సమస్యల పరిష్కారానికి 'ప్రజా దర్బార్'హాజరుకానున్న ముక్కా రూపానంద రెడ్డి
Quick Summary:
సమస్యల పరిష్కారానికి 'ప్రజా దర్బార్'హాజరుకానున్న ముక్కా రూపానంద రెడ్డి