రైల్వే కోడూరులో నీలిజెండా పండుగ.. త్వరలోనే అన్ని మండలాల్లో కార్యవర్గాల ఏర్పాటు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్
రైల్వే కోడూరు అక్టోబర్ 5 జై భీమ్ వాయిస్ టుడే:
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బహుజన్ సమాజ్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో త్వరలోనే నూతన కార్యవర్గాలను నియమించనున్నట్లు ప్రకటిస్తూ, స్థానికంగా పార్టీ నూతన కార్యాలయాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యనభ్యసించి, ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చే యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని, వారి నాయకత్వ పటిమతో పార్టీని కొత్త శిఖరాలకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లోనూ బహుజన్ సమాజ్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
Andhra
రైల్వే కోడూరులో నీలిజెండా పండుగ.. త్వరలోనే అన్ని మండలాల్లో కార్యవర్గాల ఏర్పాటు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్
Quick Summary:
రైల్వే కోడూరులో నీలిజెండా పండుగ.. త్వరలోనే అన్ని మండలాల్లో కార్యవర్గాల ఏర్పాటు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్