ఎంపీ మిథున్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కొరముట్ల
రైల్వేకోడూరు(హైదరాబాద్) సెప్టెంబర్ 12 జై భీమ్ వాయిస్ టుడే:
పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్-చార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో శుక్రవారం సాయంత్రం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పి.వి. మిథున్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు ప్రజాసేవలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. వీరి భేటీలో పలు ప్రాంతీయ అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు చర్చలు సాగినట్లు సమాచారం.
Andhra
ఎంపీ మిథున్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
Quick Summary:
ఎంపీ మిథున్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
