రైల్వే కోడూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బియ్యాల రమణ
రైల్వే కోడూరు సెప్టెంబర్ 13 జై భీమ్ వాయిస్ టుడే:
సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని దివ్య పర్వదినం వినాయక చవితిని పురస్కరించుకుని సీనియర్ పాత్రికేయులు బియ్యాల రమణ శుభాకాంక్షలు తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజానీకంతో పాటు నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం శ్రమించే అధికారులు, నాయకులు, పరిశుభ్రతను కాపాడే పారిశుద్ధ్య కార్మికులు, దేశానికి వెన్నెముకైన రైతన్నలకు ఆయన ప్రత్యేక ఆకాంక్షలు తెలియజేశారు.
అలాగే సరిహద్దుల్లో అహరహం నిరంతరం మెలకువతో ఉంటూ మాతృభూమిని కంటికి రెప్పలా కాపాడుతున్న యోధులైన సైనికులకు, సమాజానికి అద్దం పడుతూ నిజాన్ని నిర్భయంగా చాటిచెప్పే పాత్రికేయ మిత్రులకు వినాయక చతుర్థి మంగళకాంశాలు అందజేశారు. ప్రగతి మార్గంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి, ప్రజలందరి జీవితాల్లో ఆనంద నిలయాలు వెలసిల్లాలని, సకల శుభాలు చేకూరాలని విఘ్ననాయకుడిని ప్రార్థిస్తున్నట్లు సీనియర్ విలేఖరి బియ్యాల రమణ స్పష్టం చేశారు.
Andhra
రైల్వే కోడూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బియ్యాల రమణ
Quick Summary:
రైల్వే కోడూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బియ్యాల రమణ
