ధర్మ విజయానికి ప్రతీక దసరా... నియోజకవర్గ ప్రజలకు ప్రగతి శుభాకాంక్షలు
రైల్వే కోడూరు: ఆధ్యాత్మిక నిష్ఠతో, సంప్రదాయబద్ధంగా సాగుతున్న శరన్నవరాత్రి వేడుకల శుభవేళ, దుష్టశిక్షణ శిష్టరక్షణకు సూచికగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజానీకానికి, పాలనా యంత్రాంగానికి, రాజకీయ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, సమాజ శ్రేయస్సుకు శ్రమిస్తున్న పాత్రికేయులకు కడప అర్బన్ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త ముఖారూపానంద రెడ్డి, ముక్కా వరలక్ష్మి దంపతులు ముందస్తు దసరా శుభాకాంక్షలు అందజేశారు.
ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వారు మాట్లాడుతూ... సమాజంలో అధర్మంపై ధర్మం సాధించిన అద్భుత విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలు నియోజకవర్గంలో శాంతిసౌఖ్యాలను, సమృద్ధిని పెంపొందించాలని ఆకాంక్షించారు. దుర్గాభవాని దివ్యానుగ్రహంతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తులతూగాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. మతసామరస్యానికి, సోదరభావానికి వేదికైన ఈ మహా పర్వదినాన్ని ప్రజలందరూ ఐక్యతతో, ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Andhra
ధర్మ విజయానికి ప్రతీక దసరా... నియోజకవర్గ ప్రజలకు ప్రగతి శుభాకాంక్షలు
Quick Summary:
ధర్మ విజయానికి ప్రతీక దసరా... నియోజకవర్గ ప్రజలకు ప్రగతి శుభాకాంక్షలు