విజయదశమి వేళ సుఖసంతోషాలు వికసించాలి: డాక్టర్ బియ్యాల రమణ
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
చెడుపై మంచి సాధించిన విజయానికి, ఆశయాల సాధనకు ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గ సమస్త ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకు, వివిధ రంగాల ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సమాఖ్య మండల కన్వీనర్, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బియ్యాల రమణ ముందస్తు దసరా శుభాకాంక్షలు అందజేశారు. పండుగ వెలుగులు ప్రతి ఇంటా నూతన ఉత్సాహాన్ని, సిరులను నింపాలని ఆకాంక్షించారు.
ఈ శుభసందర్భంగా ఆయన ముచ్చటిస్తూ... సమాజ హితమే ఊపిరిగా అహర్నిశలు శ్రమిస్తున్న పాత్రికేయ మిత్రులకు, సర్వజనుల ఆకలి తీర్చేందుకు చెమటోడ్చే రైతు సోదరులకు, సరిహద్దుల్లో సదా జాగరూకులై మాతృభూమిని రక్షిస్తున్న వీర సైనికులకు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. సమాజానికి వీరి సేవలు అనితరసాధ్యమని కొనియాడారు.
అదేవిధంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిరంతరం జనసేవే పరమావధిగా శ్రమిస్తున్న నాయకులకు, ప్రగతి రథచక్రాలను ముందుకు నడిపిస్తున్న కార్మిక సోదరులకు, పాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న అధికారులకు, అనధికారులకు ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయదశమి పర్వదినం అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకున్నారు.
Andhra
విజయదశమి వేళ సుఖసంతోషాలు వికసించాలి: డాక్టర్ బియ్యాల రమణ
Quick Summary:
విజయదశమి వేళ సుఖసంతోషాలు వికసించాలి: డాక్టర్ బియ్యాల రమణ