స్థానిక సంగ్రామానికి కాంగ్రెస్ సమరశంఖం: ఐదు మండలాల జడ్పీటీసీ అభ్యర్థుల జాబితా
రైల్వే కోడూరు అక్టోబర్ జై భీమ్ వాయిస్ టుడే:
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహరచనలో భాగంగా శనివారం రాజంపేటలోని ఎస్సార్ కళ్యాణమండపంలో ప్రాధాన్యత కలిగిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల జడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదిత జాబితాను నియోజకవర్గ ఇన్చార్జ్ గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎన్. శాంతయ్య సంయుక్తంగా రూపొందించి పార్టీ అధిష్ఠానానికి అందజేశారు. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి జె.డి. శీలం, అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ బైపుడి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ లకు ఈ ప్రాథమిక నివేదికను అధికారికంగా అందించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు శాంతయ్య మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పూర్వవైభవం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తారని చెప్పారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు యువజన విభాగం, విద్యార్థి విభాగం, మహిళా, మైనార్టీ శ్రేణులతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తలంతా సమిష్టిగా శ్రమించి కాంగ్రెస్ పార్టీ బల నిరూపణకు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
Andhra
స్థానిక సంగ్రామానికి కాంగ్రెస్ సమరశంఖం: ఐదు మండలాల జడ్పీటీసీ అభ్యర్థుల జాబితా
Quick Summary:
స్థానిక సంగ్రామానికి కాంగ్రెస్ సమరశంఖం: ఐదు మండలాల జడ్పీటీసీ అభ్యర్థుల జాబితా