జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయుడు బైసాని కిరణ్ కుమార్
రైల్వే కోడూరు, అక్టోబర్ 11 జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రను ఆయన ఆత్మీయ మిత్రుడు బైసాని కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్రకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నాగేంద్ర చేస్తున్న సేవలు అభినందనీయమని కిరణ్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయుడు బైసాని కిరణ్ కుమార్
Quick Summary:
జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయుడు బైసాని కిరణ్ కుమార్