కుడా ఛైర్మన్, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహణ.
రైల్వే కోడూరు సెప్టెంబర్ 18 జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వే కోడూరు రాఘవరాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి విన్నపాలతో తరలివచ్చిన బాధితులను రూపానందరెడ్డి నేరుగా కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. వారి వద్ద నుంచి అర్జీలను స్వీకరించి, ఆయా సమస్యల తీవ్రతను వివరంగా అడిగి తెలుసుకున్నారు.
బాధితుల నుంచి స్వీకరించిన అర్జీలపై ఆయన తక్షణమే స్పందించారు. సమస్యల స్వభావాన్ని బట్టి ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో దూరవాణి ద్వారా నేరుగా సంభాషించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల తీవ్రతను అధికారులకు వివరించి, ప్రజా సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కేవలం ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించడానికే పరిమితం కాకుండా, ప్రతీ సమస్యకూ తగిన పరిష్కారం లభించే వరకు ప్రజలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో ఈ ప్రజా దర్బార్ సాగుతుండటం గమనార్హం. ప్రజా సమస్యలపై ఆయన చూపుతున్న తక్షణ స్పందన, అధికారులతో జరుపుతున్న సమన్వయం పట్ల నియోజకవర్గ ప్రజల నుంచి హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra
కుడా ఛైర్మన్, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహణ.
Quick Summary:
కుడా ఛైర్మన్, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహణ.