ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రి సహాయ నిధి
రైల్వే కోడూరు సెప్టెంబర్ 26 జై భీమ్ వాయిస్ టుడే: బాధితులకు అండగా నిలవడంలో ప్రభుత్వం నిరంతరం ముందుంటుందని శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్పష్టం చేశారు. పెనగలూరుకు చెందిన సనగాని రవిచంద్రబాబుకు మంజూరైన రూ. 1,57,297 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఆదివారం వారి నివాసంలో ప్రజాప్రతినిధులు ఆత్మీయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పాటు కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుల సతీమణి ముక్కా వరలక్ష్మి బాధితుడి ఇంటికి చేరుకుని చెక్కును హస్తగతం చేశారు. తీవ్రమైన ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం కొండంత అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని కొనియాడారు. కష్టకాలంలో ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సాయం పట్ల బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రి సహాయ నిధి
Quick Summary:
ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రి సహాయ నిధి