వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమరశంఖం
రైల్వే కోడూరు సెప్టెంబర్ 6 టుడే: నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు భారీ విస్తృత స్థాయి సమావేశానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 7 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న శ్రీ కళ్యాణ మంటపంలో ఈ కీలక సమవేశం జరగనుంది. మాజీ శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతమే ప్రధాన అజెండాగా సాగనున్న ఈ భేటీకి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల కన్వీనర్లు, ముఖ్య నేతలు, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, పురపాలక వర్డు సభ్యులు, మండల పరిషత్ ప్రాంతీయ సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాంతీయ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న శ్రేణులందరూ తరలివచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం ప్రకటనలో పిలుపునిచ్చింది.
Andhra
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
Quick Summary:
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమరశంఖం
