జైభీమ్ వాయిస్ టుడే సెప్టెంబర్ 26 -
వీరులపాడు: మండలంలోని పెద్దాపురం, అల్లూరు గ్రామాల్లో వినాయక చవితి నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథుడి ప్రతిమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నిర్వాహకులను ఆమె అభినందించారు. నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో, భక్తిభావంతో నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
Andhra
పెద్దాపురం, అల్లూరు గ్రామాల్లో నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
Quick Summary:
పెద్దాపురం, అల్లూరు గ్రామాల్లో నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య