జై భీమ్ వాయిస్ టుడే నందిగామ డివిజన్ ప్రతినిధి న్యూస్ //ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన దివంగత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని నందిగామలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందా వజ్రయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ ప్రజలకు అందించిన సేవలను, సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శులు పొల్ల చిన అంతయ్య, పెసరవెల్లి శ్యాంబాబు, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు, మాజీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కనకపూడి వెంకటేశ్వరరావు, చందర్లపాడు మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వేల్పుల శ్రీహరి, నందిగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపాలశెట్టి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
Andhra
ఘనంగా దివంగత నేత వైఎస్సార్ 17వ వర్ధంతి
Quick Summary:
ఘనంగా దివంగత నేత వైఎస్సార్ 17వ వర్ధంతి