సాగు ఖర్చుకు నాటి చెక్.. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి అడుగులు!
రైల్వేకోడూరు సెప్టెంబర్ 28 జై భీమ్ వాయిస్ టుడే: కష్టపడి పనిచేసే రైతుపై సాగు భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. అన్నదాత ఆర్థిక పరిపుష్టే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగా యంత్ర సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మండల పరిధిలో వెలుగు ఆధ్వర్యంలో నడుస్తున్న చిన్న, సన్నకారు, మహిళా రైతు సమూహాలకు మంజూరైన అధునాతన యంత్రాన్ని స్థానిక నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు రైతులకు అందించారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రూపొందించిన ఈ పథకం ద్వారా పొలం దుక్కి దున్నడం నుంచి పంట దిగుబడుల రవాణా వరకు ప్రతి దశలోనూ రైతులకు ఎంతో ఊరట కలగనుంది. ప్రైవేటు మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు పది శాతం తక్కువ రుసుముకే యంత్ర సేవలు లభించనుండటం గమనార్హం. ప్రస్తుతం పెరుగుతున్న కూలీల కొరత, సమయాభావం వంటి సమస్యల నేపథ్యంలో ఆధునిక యంత్రాల వినియోగం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా పంట పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రైవేటు యజమానులను ఆశ్రయించి రైతాంగం ఆర్థికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందుతోంది. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఈ చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రగతిశీల మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి అడుగులు–టిడిపి ఇన్చార్జి రూపానంద రెడ్డి
Quick Summary:
రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి అడుగులు–టిడిపి ఇన్చార్జి రూపానంద రెడ్డి
