చిట్వేలిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాపారికి పార్టీ నేతల పరామర్శ
రైల్వే కోడూరు సెప్టెంబర్ 7 జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సందడి నెలకొంది. స్థానిక ఎరువుల వ్యాపారి షేక్ కరీముల్లా గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం నివాసంలో కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గ నాయకుడు, మొదటి శ్రేణి కాంట్రాక్టర్ పాటూరు శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఆయన గృహానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. కరీముల్లా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తి కోలుకోవాలని ఆకాంక్షించారు.
కష్టసమయంలో తోటి పౌరులకు అండగా నిలవడం నాయకుల బాధ్యత అని, కరీముల్లా త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వ్యాపార కార్యకలాపాలు సాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నాయకుడు శ్రీనివాసులు రెడ్డి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నాగిరెడ్డి కరుణాకర్ రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చిన్న, సుబ్రమణ్యం, శివ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
Andhra
చిట్వేలిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాపారికి పాటూరి పరామర్శ
Quick Summary:
చిట్వేలిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాపారికి పాటూరి పరామర్శ
