ఉప్పరపల్లిలో విషాదం: ధనలక్షమ్మ పార్థివదేహానికి ధ్వజారెడ్డి నివాళులు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 23 జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వే కోడూరు మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల ధనలక్షమ్మ ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, మండల అధ్యక్షుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి ఉప్పరపల్లికి చేరుకుని, భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కష్టసమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంగల్ రెడ్డి, సుబ్బారెడ్డి, కృష్ణ రెడ్డిలతో పాటు పలువురు పార్టీ నాయకులు, స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.
Andhra
ఉప్పరపల్లిలో విషాదం: ధనలక్షమ్మ పార్థివదేహానికి ధ్వజారెడ్డి నివాళులు
Quick Summary:
ఉప్పరపల్లిలో విషాదం: ధనలక్షమ్మ పార్థివదేహానికి ధ్వజారెడ్డి నివాళులు
