అశ్రునయనాల నడుమ అమరుడు యువకి తుది వీడ్కోలు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 26 జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వే కోడూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఎన్ఆర్ఐ చింతకాయల యువ రాయల్ అంతిమయాత్ర అత్యంత విషాదభరిత వాతావరణంలో సాగింది. పార్టీకి, ప్రజా సంక్షేమానికి నిరంతరం తపించిన క్రియాశీల నాయకుడిని కోల్పోవడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ తుది వీడ్కోలు కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొని, చింతకాయల యువ పార్థివదేహానికి జనసేన జెండా, పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు. అంతిమయాత్ర పొడవునా "జోహార్ చింతకాయల యువ" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే యువ భౌతికంగా దూరం కావడం జనసేన రంగానికి, రైల్వే కోడూరు నియోజకవర్గ సమూహానికి తీరని లోటని నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ అంతిమయాత్రలో అధికార పార్టీ కూటమి నేతలు యనమల భాస్కర్, పోతురాజు నవీన్, నాగోలు అమర్, ముత్యాల కిషోర్, మల్లెం హేమంత్ పాల్గొని చింతకాయల యువకు నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
Andhra
అశ్రునయనాల నడుమ అమరుడు యువకి తుది వీడ్కోలు
Quick Summary:
అశ్రునయనాల నడుమ అమరుడు యువకి తుది వీడ్కోలు


