వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి: కోరముట్ల శ్రీనివాసులు పిలుపు
రైల్వేకోడూరు జై భీమ్ వాయిస్ టుడే: రాబోయే పరిషత్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని అనంతరాజంపేట గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ పరిషత్ ఎన్నికలు సరైన వేదిక అని తెలిపారు. సంక్షేమ ఫలాలు మళ్లీ అందరికీ అందాలంటే ఫ్యాను గుర్తుపై ఎంపీటీసీకి ఒక ఓటు, జెడ్పీటీసీకి ఒక ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో విజేతలుగా నిలపాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పంజం వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిరెడ్డి ధ్వజారెడ్డి, యువ నాయకులు పంజం సందీప్ రెడ్డి, పంజం శ్రీవర్ధన్ రెడ్డి, మండల జెడ్పీటీసీ అభ్యర్థి అంబటి మురళి, ఎంపీటీసీ అభ్యర్థులు బత్తల దేవి, పాలెంకోట చంద్ర పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు అకేపాటి రంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ బండారు మల్లికార్జున, జనార్దన్ రాజు, ముద్దపోలు మణి, చలపతి, షఫీ, బత్తల మణిలతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Andhra
వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి: కోరముట్ల శ్రీనివాసులు పిలుపు
Quick Summary:
వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి: కోరముట్ల శ్రీనివాసులు పిలుపు
