అనుమతుల్లేకుండానే అక్రమ మట్టి తోలకాలు: పట్టించుకోని అధికార యంత్రాంగం
రైల్వే కోడూరు సెప్టెంబర్ 18 జై భీమ్ వాయిస్ టుడే:
మండల పరిధిలోని పెద్దవరంపాడు, ఎల్లాయేపల్లి చెరువులు అక్రమార్కులకు కామధేనువుగా మారాయి. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే మట్టి మాఫియా నిర్విరామంగా అక్రమ తోలకాలను సాగిస్తోంది. రేయింబవళ్లు తేడా లేకుండా యంత్రాలతో చెరువుల గుండెను తవ్వి పోస్తూ, వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం కనీస దృష్టి సారించకపోవడం గమనార్హం.
కూటమి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ప్రకృతి వనరులను విచక్షణారహితంగా దోచుకుంటున్నా స్థానిక యంత్రాంగం నిద్రమత్తు వీడటం లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో భారీ తవ్వకాల వల్ల భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమ మట్టి తోలకాలకు అడ్డుకట్ట వేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామీణులు డిమాండ్ చేస్తున్నారు.
Andhra
అనుమతుల్లేకుండానే అక్రమ మట్టి తోలకాలు: పట్టించుకోని అధికార యంత్రాంగం
Quick Summary:
అనుమతుల్లేకుండానే అక్రమ మట్టి తోలకాలు: పట్టించుకోని అధికార యంత్రాంగం