*జైభీమ్ వాయిస్ టుడే నందిగామ*
*04-10-2026* ఆదివారం
నిరుపేదలకు పాత స్టీలు వస్తువుల పంపిణీ: సేవా సమితి సభ్యుల మానవత్వం.
నందిగామ పాత బైపాస్* *లో గుడారాల్లో నివాసం ఉండే జంగాల కాలనీ
*సమాజంలో వెనుకబడిన, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే పరమావధిగా అన్నపూర్ణ సేవాసమితి లక్ష్యం*
ఈ సేవా సమితి సభ్యులు పాత వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు.
*స్థానిక నందిగామ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల పేద ప్రజలకు పాత బట్టలు, గృహోపకరణాలు మరియు వారికి పనికి వచ్చే వస్తువులు పంచి పంపిణీ చేశారు*
*ఈ సందర్భంగా అన్నపూర్ణ సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ... మన ఇళ్లల్లో నిరుపయోగంగా ఉండే వస్తువులను పారేయకుండా, అవసరమైన వారికి అందిస్తే వారి ముఖాల్లో ఆనందం చూడవచ్చని అన్నారు*.
*ఈ కార్యక్రమంలో సేవా* *సమితి సభ్యులు, స్వచ్ఛంద సేవకులు మరియు స్థానిక పెద్దలు పాల్గొని నిరుపేదలకు వస్తువులను అందజేశారు*
వస్తువులను అందుకున్న లబ్ధిదారులు సేవా సమితి సభ్యుల ఉదారతకు కృతజ్ఞతలు తెలిపారు.
*భావితరాలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని స్థానికులు కొనియాడారు*
*జంగాల కాలనీలో ఉన్న పేదవార్కి ఉచిత స్టీలు సామాను మరియు పాత వస్త్రములు పంపిణీ*
*నందిగామ రైతు పేట కు చెందిన కపిలవాయి మల్లికార్జునరావు మరియు వారి కుమారుడు గంగాధర్ (గంగ) అందజేసిన స్టీలు సామానులను పాత బైపాస్ లో గుడారాలు వేసుకొని జీవిస్తున్న నిరుపేదలైన 50 కుటుంబాల వారికి పంపిణీ గావించడమైనది*
*మరియు నందిగామ కాకాని నగర్ వాస్తవ్యులు గోనుగుంట్ల హరి ఇచ్చినటువంటి పాత వస్త్రములను కూడా పంపిణీ గావించడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు పారేపల్లి సాయిబాబు, వుడతా శ్రీను, మణి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.*
Andhra
దాతృత్వాన్ని చాటిన నందిగామ అన్నపూర్ణ సేవాసమితి*
Quick Summary:
దాతృత్వాన్ని చాటిన నందిగామ అన్నపూర్ణ సేవాసమితి*