ఓబులవారిపల్లిలో వీధిదీపాలు బంద్: పది రోజులుగా చీకట్లోనే ప్రజలు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 3 జై భీమ్ వాయిస్ టుడే:
ఓబులవారిపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్ వెనుక రెండు వీధుల్లో గత పది రోజులుగా వీధిదీపాలు వెలగడం లేదు. దీంతో సాయంత్రం వేళల్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులు బయటకు రావడానికి తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో విషసర్పాల భయం వెంటాడుతోందని, అత్యవసర సమయాల్లో చీకట్లోనే వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ఈ సమస్యపై పంచాయతీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్థులు తెలుపుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వీధిదీపాలను పునరుద్ధరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Andhra
అంధకారంలో ఓబులరుపల్లి గ్రామవాసుల
Quick Summary:
ఓబులవారిపల్లిలో వీధిదీపాలు బంద్: పది రోజులుగా చీకట్లోనే ప్రజలు
