ఓబులవారిపల్లె ఎన్నికల బరిలో రాజంపేట టిడిపి మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి కటికల్స్ సునీత అభ్యర్థి గా నామినేషన్ దాఖలు
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే: స్థానిక సంస్థల ఎన్నికల పర్వంలో భాగంగా ఓబులవారిపల్లె ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలి పదవికి అభ్యర్థిగా రాజంపేట తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి కటికం సునీత తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. తిరుపతి పరిధిలోని ఈ స్థానానికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా, నామినేషన్ పత్రం వరుస సంఖ్య 7గా నమోదైంది.
అభ్యర్థి తరఫున నామినేషన్ పత్రాన్ని గురువారం సాయంత్రం 4:50 గంటల సమయానికి రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఈ క్రమంలో దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియను తిరుపతిలోని డిఆర్ డిఎ కార్యాలయంలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8:00 గంటలకు ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. సమరం తీవ్రమవుతున్న నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ఘట్టంపై ఆసక్తి నెలకొంది.
Andhra
ఓబులవారిపల్లె ఎన్నికల బరిలో రాజంపేట టిడిపి మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి కటికల్స్ సునీత అభ్యర్థి గా నామినేషన్ దాఖలు
Quick Summary:
ఓబులవారిపల్లె ఎన్నికల బరిలో రాజంపేట టిడిపి మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి కటికల్స్ సునీత అభ్యర్థి గా నామినేషన్ దాఖలు