భక్తిశ్రద్ధలతో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన: పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 7 జై భీమ్ వాయిస్ టుడే:
చిట్వేల్ మండలం నాగిరిపాడు పంచాయతీ ఎన్. ఉప్పరపల్లి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కన్నులపండువగా సాగింది. లింగం లక్ష్మీకర్ సోదరులు మరియు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఆలయానికి చేరుకున్న ఆయనకు గ్రామ ప్రజలు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ ఆధ్యాత్మిక శోభను, ఆయురారోగ్యాలను అందించాలని, ఊరిలో శాంతిసౌఖ్యాలు విలసిల్లాలని ఆ సీతారాముల వారిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ వేడుకలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మాజీ సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి, యువ నాయకులు కొల్లం యష్పాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షుడు ప్రభాకర్ యాదవ్, చిట్వేల్ పట్టణ అధ్యక్షుడు హజరత్ రెడ్డి, బసిరెడ్డి రమణారెడ్డి, గల్ఫ్ విభాగ సహాయ కన్వీనర్ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గులాం బాషా, ఇతర స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తుల రామనామ స్మరణలతో ఉప్పరపల్లి గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించింది.
Andhra
భక్తిశ్రద్ధలతో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన: పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు
Quick Summary:
భక్తిశ్రద్ధలతో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన: పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు

