*మహనీయుల విగ్రహాలకు అవమానం.!!*
*చోద్యం చూస్తున్న మున్సిపల్ కమిషనర్!*
*గాంధీ సెంటర్ లో విగ్రహాలు కనిపించకుండా ఇష్టానుసారంగా బ్యానర్ల ఏర్పాటు.*
*జై భీమ్ న్యూస్ టుడే నందిగామ, సెప్టెంబర్ 1:*
నందిగామ పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీ సెంటర్ లో మహనీయులు, ముఖ్య నాయకుల విగ్రహాలకు అవమానం జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలో అత్యంత ముఖ్యమైన గాంధీ సెంటర్ లో ఉన్న మహనీయుల విగ్రహాలు కనిపించకుండా హీరోల పుట్టినరోజుల పేరుతో ఇష్టానుసారంగా భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విగ్రహాల ముందు భాగం పూర్తిగా కప్పేస్తూ బ్యానర్లు కట్టడంతో విగ్రహాలే కనిపించని దుస్థితి నెలకొంది. ఫోటోలో చూస్తే విగ్రహాల పైనే బ్యానర్లు కప్పిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది.
అసలు మున్సిపాలిటీ అనుమతి లేకుండా సెంటర్ లో బ్యానర్లు ఎలా వేస్తారు? మహనీయుల విగ్రహాలకు కనీసం విలువ లేకుండా చేస్తున్నా కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సమస్యపై పలు పత్రికల్లో వార్తలు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజా సమస్యలపైనా, పారిశుధ్యంపైనా స్పందించని మున్సిపల్ కమిషనర్, కనీసం మహనీయుల విగ్రహాలకు జరుగుతున్న అవమానంపైనా స్పందించకపోవడం దారుణమని, అసలు కమిషనర్ ఉన్నారా? నిద్రమత్తులో ఉన్నారా? అని స్థానికులు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, విగ్రహాలకు అడ్డుగా ఉన్న అక్రమ బ్యానర్లను తక్షణమే తొలగించి, ఇష్టానుసారంగా బ్యానర్లు వేసే వారిపై, పర్యవేక్షించని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Andhra
మహనీయుల విగ్రహాలకు అవమానం.!!* *చోద్యం చూస్తున్న మున్సిపల్ కమిషనర్
Quick Summary:
మహనీయుల విగ్రహాలకు అవమానం.!!* *చోద్యం చూస్తున్న మున్సిపల్ కమిషనర్