జడ్పీటీసీ సమరంలో ‘అందరివాడు’ అంబటి!
రైల్వే కోడూరు అక్టోబర్ జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వే కోడూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామీణ సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ అధిష్ఠానం సెట్టిగుంట గ్రామానికి చెందిన అంబటి మురళి ఎం.ఏపేరును ఖరారు చేయడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మృదుస్వభావిగా, వివాదరహితుడిగా పేరుగాంచిన ఆయనకు టికెట్ కేటాయించడంపై స్థానిక బలిజ సామాజికవర్గంతో పాటు సర్వజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాక్షేత్రంలో నిత్యం అందుబాటులో ఉంటూ, నిరుపేదల కష్టసుఖాల్లో పాలుపంచుకునే నైజం మురళికి సొంతం. అధికారం ఉన్నా లేకపోయినా ఊరి ప్రయోజనాల కోసం, పేదల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే ఆయనను అన్ని వర్గాల ప్రజలు ‘మన మనిషి’గా భావిస్తారు. పార్టీలకు అంటీముట్టనట్లు ఉండే సామాన్యులను సైతం తన మంచితనంతో కలుపుకొనిపోయే విశేష జనాదరణ ఆయన ప్రత్యేకత.
క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన ప్రజాదరణను, నాయకత్వ పటిమను గుర్తించే అధినేతలు ఆయనను జడ్పీటీసీ బరిలోకి దించినట్లు రాజకీయానుభవజ్ఞులు విశ్లేషిస్తున్నారు. అంబటి మురళి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండగా, పార్టీ విజయం నల్లేరుపై నడకేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Andhra
జడ్పీటీసీ సమరంలో ‘అందరివాడు’ అంబటి!
Quick Summary:
జడ్పీటీసీ సమరంలో ‘అందరివాడు’ అంబటి!