సుప్రీం తీర్పు తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరం
రైల్వే కోడూరు అక్టోబర్ 9 జై భీమ్ వాయిస్ టుడే:
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. పల్లె పోరు నిర్వహణకు సంబంధించి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన అనంతరం మాత్రమే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తేల్చిచెప్పారు. కోర్టు ఆమోదం తెలిపిన వెంటనే ఎన్నికలు జరిపేందుకు సర్వం సిద్ధం చేసినట్లు వివరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ఆధారంగానే పోలింగ్ నిర్వహిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. సాంకేతికత కంటే నమ్మకానికే ప్రాధాన్యమిస్తూ, ఈ ఎన్నికలను పూర్తిగా సాంప్రదాయ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరపనున్నట్లు వెల్లడించింది. దీనికి కావలసిన బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే అన్ని జిల్లాల్లో సిద్ధం చేసి ఉంచారు. గత రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని, యంత్రాంగం మరియు సిబ్బంది సమరానికి సమాయత్తమయ్యారని కమిషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
Andhra
సుప్రీం తీర్పు తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరం
Quick Summary:
సుప్రీం తీర్పు తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరం