రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 11 జై భీమ్ వాయిస్ టుడే:
రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు ఏకమై ఈ వేడుకలను నిర్వహించారు.
ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గా నాగేంద్ర ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కువైట్ గల్ఫ్ కన్వీనర్ గోవింద్ నాగరాజు, ఆయన అభిమానులు మిథున్ రెడ్డిపై రూపొందించిన ప్రత్యేక పాట ఆల్బమ్ పోస్టర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. నాయకుని పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఈ పాట ఆల్బమ్ నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, ముస్లిం మైనార్టీ స్టేట్ సెక్రటరీ ముజీబ్, సుంకేసులు రఫీ, వైఎస్ఆర్సిపి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, యువ నాయకులు పంజం శ్రీ వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు అంబటి మురళి, మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య యాదవ్, గల్ఫ్ కన్వీనర్ బిహేచ్. ఇలియాజ్, బహరైన్ కన్వీనర్ ఓర్స్ నాగరాజు, రహమతుల్లా, పి. సురేష్ నాథ్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, గజ్జల నరసారెడ్డి, శంషాద్దీన్, సామీర్, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ రాజా (గని), ఎంపీటీసీ బండారు మల్లికార్జున, పోతయ్య, ప్రభాకర్ యాదవ్ తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
రైల్వే కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు మిథున్ రెడ్డి పై నూతన పాట ఆవిష్కరణ
Quick Summary:
రైల్వే కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు మిథున్ రెడ్డి పై నూతన పాట ఆవిష్కరణ


