విజయదశమి వేళ మతసామరస్య సందేశం: నియోజకవర్గ ప్రజలకు వల్లి సాహెబ్ (ఆలీ) దసరా శుభాకాంక్షలు
రైల్వే కోడూరు అక్టోబర్ 19 జై భీమ్ వాయిస్ టుడే
చీకటిని పారద్రోలి వెలుగులను, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు వల్లి సాహెబ్ (ఆలీ) ముందస్తు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, మతసామరస్యం పెంపొందేలా ఈ పండుగ మహోత్సవం సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ పావన పర్వదినం నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలోనూ వెలుగులు నింపి, అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరారు. నాగేటి చాలుతో జగత్తుకు అన్నంపెట్టే రైతన్నలకు, శ్రమనే నమ్ముకున్న కార్మిక లోకానికి, నిరంతరం ప్రజాసేవలో ఉండే ప్రతి ఒక్కరికీ ఈ విజయదశమి సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra
విజయదశమి వేళ మతసామరస్య సందేశం: నియోజకవర్గ ప్రజలకు వల్లి సాహెబ్ (ఆలీ) దసరా శుభాకాంక్షలు
Quick Summary:
విజయదశమి వేళ మతసామరస్య సందేశం: నియోజకవర్గ ప్రజలకు వల్లి సాహెబ్ (ఆలీ) దసరా శుభాకాంక్షలు