నిరుద్యోగులకు సువర్ణావకాశం: రేపే రైల్వే కోడూరులో బృహత్ ఉద్యోగ మేళా!
రైల్వే కోడూరు సెప్టెంబర్ 27 జై భీమ్ వాయిస్ టుడే:
ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తీపి కబురు అందించింది. స్థానిక శాసనసభ్యుడు అరవ శ్రీధర్ సహకారంతో రైల్వే కోడూరు నియోజకవర్గంలో భారీ ఉద్యోగ మేళాకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబరు 28న ఉదయం 08:30 గంటల నుంచి తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు, సాయినగర్‌లోని శ్రీ సాయి డిగ్రీ పిజి కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ బృహత్ ఉద్యోగ మేళాలో ప్రసిద్ధ బహుళ జాతీయ సంస్థలతో సహా 12కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ విభాగాల్లో ఉన్న 330కి పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, సాంకేతిక మరియు సాధారణ డిగ్రీ విద్యార్హతలు కలిగిన 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు అర్హత, ఉద్యోగ స్వభావాన్ని బట్టి నెలకు రూ. 12,627 నుండి రూ. 35,000 వరకు వేతనంతో పాటు, ఆకర్షణీయమైన వార్షిక ప్యాకేజీలు, వసతి, ఆహార సదుపాయాలు లభించనున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు తదితర ముఖ్య ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఈ మేళాకు హాజరుకావచ్చు.
పూర్తి వివరాలకు 9052717078, 9988853335 సంఖ్యలను సంప్రదించవచ్చని లేదా నిర్దేశిత వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. అర్హత కలిగిన యువతీ యువకులంతా తమ వివరాలతో హాజరై ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
Andhra
నిరుద్యోగులకు సువర్ణావకాశం: రేపే రైల్వే కోడూరులో బృహత్ ఉద్యోగ మేళా!
Quick Summary:
నిరుద్యోగులకు సువర్ణావకాశం: రేపే రైల్వే కోడూరులో బృహత్ ఉద్యోగ మేళా!