రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం
రైల్వే కోడూరు సెప్టెంబర్ 28 జై భీమ్ వాయిస్ టుడే:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి పంచాయతీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కోడూరు మండల విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా కొరముట్ల శ్రీనివాసులు ప్రసంగిస్తూ, పార్టీ ఆవిర్భావం నుండి అంకితభావంతో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు, నాయకులకు రాబోయే ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మన హయాంలో జరిగిన సేవలను ధైర్యంగా వివరిస్తూ ప్రజలను ఓటు అడిగే పూర్తి హక్కు మనకు ఉందని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చే కూటమి నాయకులను నిలదీసేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
కార్యకర్తలందరూ ఐక్యమత్యంగా ముందడుగు వేసి పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించాలని కోరారు. ఏవైనా సమస్యలు లేదా సూచనలు ఉంటే సమిష్టిగా చర్చించి పరిష్కరించుకుందామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి 2029 నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే ధ్యేయంగా పనిచేయాలని, కోడూరు నియోజకవర్గం ఎప్పటికీ వైఎస్సార్సీపీకి తిరుగులేని కోట అని మరోసారి నిరూపించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు పంజం వేణుగోపాల్ రెడ్డి, మాదినేని వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండల నాగేంద్ర, జిల్లా సహకార సంఘం సభ్యులు అన్వర్ బాషా, జిల్లా పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గ ప్రతినిధి రత్నమ్మ, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కనుపర్తి ఈశ్వరయ్య, సీనియర్ నాయకులు అంబటి మురళి, మాజీ ఆర్యవైశ్య సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, ముస్లిం మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ముజీబ్, రాఘవరాజుపురం పూర్వ దేవస్థాన ధర్మకర్త రవిచంద్ర రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్వ అధ్యక్షుడు సుబ్బరామరాజు, నాయకులు సలాం, మస్తాన్, నరసింహారెడ్డి, ఓబుల్ రెడ్డి, జిల్లా యువజన విభాగ కార్యదర్శి దమ్ము రఘు, జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి రాజా (గని), దాడిశెట్టి సిద్దు రాయల్, కొండూరు సుదర్శన్ రాజు, కరిముల్లా, ఫరూక్, రౌఫ్, ఆంజనేయులు, రత్తయ్య, డిష్ రాజా తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం
Quick Summary:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం
