గుర్తింపు లేని బతుకులు: కార్డే లేక సర్కారు సాయం అందని దుస్థితి
ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. సంక్షేమ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం, పెద్దవరంపాడు గ్రామంలోని గిరిజన కాలనీ వాసుల ఆవేదన ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
గ్రామంలోని దాదాపు నలభై గిరిజన కుటుంబాలు ప్రాథమిక గుర్తింపు కార్డులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నాయి. కనీసం ఆధార్, రేషన్ కార్డులు కూడా లభించకపోవడంతో ప్రభుత్వం అందించే సరుకులు, పండుగ కానుకలు, వృద్ధాప్య పింఛన్లు వంటి ఏ ఒక్క లబ్ధికి వీరు నోచుకోవడం లేదు. నానాటికీ పెరుగుతున్న ధరల కాలంలో ఉపాధి దొరకడమే కష్టంగా మారిన తరుణంలో, ప్రభుత్వ సాయం అందక జీవనం సాగించడం వర్ణనాతీతంగా మారింది.
ఈ అభాగ్యుల పరిస్థితి వారి పిల్లల భవిష్యత్తును కూడా చీకట్లోకి నెడుతోంది. బడికి పంపాలన్నా, చదువుకోవాలన్నా గుర్తింపు పత్రాలు అడుగుతుండటంతో పిల్లల విద్య అర్ధాంతరంగా ఆగిపోతోంది. జన్మతః రావాల్సిన హక్కులను పొందలేక ఈ అభాగ్యులు కాలం వెళ్లదీస్తున్నారు. జై భీమ్ వాయిస్ టుడే ప్రతినిధితో తమ దీనస్థితిని వివరిస్తూ, ఈ సమస్యను సంబంధిత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
బాధ్యతగల అధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ నేరుగా జోక్యం చేసుకుని, ప్రభుత్వ ప్రాథమిక నిబంధనల ప్రకారం పెద్దవరంపాడు గిరిజనులకు ఆధార్, రేషన్ కార్డులు వెంటనే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, గిరిజన వాసులు బండి కోటయ్య, మేకల చెంచయ్య, శీను, చరణ్, ఒక ఆధారాన్ని చూపాలని వేడుకున్నారు .
Andhra
40 సంవత్సరాలుగా గుర్తింపు లేని బతుకులు: కార్డే లేక సర్కారు సాయం అందని దుస్థితి
Quick Summary:
40 సంవత్సరాలుగా గుర్తింపు లేని బతుకులు: కార్డే లేక సర్కారు సాయం అందని దుస్థితి