ఆక్రమణదారుల గుండెల్లో గుబులు: భూ వివాదాలకు చెక్ పెడుతున్న తహసీల్దార్ సిద్ధేశ్వరరావు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 6 జై భీమ్ వాయిస్ టుడే:
ఓబులవారిపల్లె మండలంలో ఏళ్లతరబడి వేధిస్తున్న భూ సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం చూపుతూ, భూ ఆక్రమణదారుల ఆటకట్టిస్తుండడంతో తాత్కాలిక తహసీల్దార్ సిద్ధేశ్వరరావు చర్యలు స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టంతో పాటు భూ ఆక్రమణల నిరోధక చట్ట నిబంధనలను కఠినంగా అమలుచేస్తూ రెవెన్యూ యంత్రాంగాన్ని పరుగులు తీస్తున్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోక రెవెన్యూ రికార్డుల్లో పెండింగ్‌లో పడి ఉన్న క్లిష్టమైన భూ తగాదాలను స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తుండడంతో క్షేత్రస్థాయిలో సామాన్య రైతులకు ఊరట లభిస్తోంది.
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆరోపణలు వచ్చిన తక్షణమే స్పందిస్తూ, సంబంధిత చట్టాల ప్రకారం భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ సర్వే నిర్వహణ, భూహక్కుల నమోదు పకడ్బందీగా చేపట్టడంతో భూమాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడుతోంది. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టం పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన శైలి పట్ల ప్రాంతీయ రైతాంగం తీవ్ర హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజానుకూల పాలనతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న అధికారి సేవలు ప్రశంసనీయమని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
Andhra
ఆక్రమణదారుల గుండెల్లో గుబులు: భూ వివాదాలకు చెక్ పెడుతున్న తాత్కాలిక తాసిల్దార్ సిద్ధేశ్వరరావు
Quick Summary:
ఆక్రమణదారుల గుండెల్లో గుబులు: భూ వివాదాలకు చెక్ పెడుతున్న తాత్కాలిక తహసీల్దార్ సిద్ధేశ్వరరావు