*జైభీమ వాయిస్ టుడే ఒంగోలు , సెప్టెంబర్ 26:* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ భౌతికకాయాన్ని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ శనివారం సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా రాజశేఖర్‌తో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో, పట్టుదలతో నిర్వహించేవారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పట్ల రాజశేఖర్ ఎంతో అంకితభావంతో పనిచేసేవారని పేర్కొన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కూడా చురుగ్గా పనిచేశారని తెలిపారు.
డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నిరసనగా విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాజశేఖర్ తనతో కలిసి పాల్గొన్నారని అరుణ్ కుమార్ తెలిపారు. ఆ సమయంలో పోలీసులు రాజశేఖర్‌పై దాడి చేశారని, ఆయనకు అస్వస్థతగా అనిపించడంతో అక్కడి నుంచి వెళ్లి కారులో కూర్చున్నారని చెప్పారు. అనంతరం ఒంగోలులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని, తదుపరి హైదరాబాద్‌కు వెళ్లిన రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.రాజశేఖర్ మృతి పార్టీకి, ఆయనను అభిమానించే వారికి తీరని లోటని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Andhra
కాకుమాను రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నివాళులు
Quick Summary:
కాకుమాను రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నివాళులు