ఓబులవారిపల్లి ఎంపీటీసీ-2 జనసేన అభ్యర్థిగా కటికం నాగేంద్రకు అవకాశమివ్వాలి
రైల్వే కోడూరు అక్టోబర్ జై భీమ్ వాయిస్ టుడే:
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం కటికంవారిపల్లికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కటికం నాగేంద్ర రాబోయే స్థానిక సంస్థల సమరంలో పోటీకి సిద్ధమయ్యారు. ఓబులవారిపల్లి ఎంపీటీసీ-2 స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా తనను బరిలోకి దించాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తున్నానని తెలిపారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ స్థానిక శాసనసభ్యుడు అరవ శ్రీధర్ భారీ మెజార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించానని నాగేంద్ర గుర్తుచేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా ఓబులవారిపల్లిలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఒకటి తెలుగుదేశం పార్టీకి కేటాయించినప్పటికీ, రెండవ స్థానాన్ని జనసేనకు కేటాయించి తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఘనవిజయం సాధించి పార్టీకి కానుకగా అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన తనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నట్లు, కూటమి నాయకత్వం తన సేవలను గుర్తించి ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Andhra
ఓబులవారిపల్లి ఎంపీటీసీ-2 జనసేన అభ్యర్థిగా కటికం నాగేంద్రకు అవకాశమివ్వాలి
Quick Summary:
ఓబులవారిపల్లి ఎంపీటీసీ-2 జనసేన అభ్యర్థిగా కటికం నాగేంద్రకు అవకాశమివ్వాలి