ముక్కా సాయి వికాస్ రెడ్డి నామినేషన్ ఘట్టం!
రైరైల్వేకోడూరు జై భీమ్ వాయిస్ టుడే: ఓబులవారిపల్లి మండల రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. స్థానిక సంస్థల సమరంలో భాగంగా ఓబులవారిపల్లి 1 ఎంపీటీసీ అభ్యర్థిగా యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు, కుడా అధిపతి ముక్కా రూపానంద రెడ్డి తనయుడైన సాయి వికాస్ రెడ్డి రాజకీయ రంగప్రవేశంతో స్థానిక వర్గాల్లో విశేష ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 21న ఉదయం ఎనిమిది గంటలకు ముక్కావారిపల్లిలోని స్వగృహం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి, ఓబులవారిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా అడుగులేస్తున్న యువ నాయకుడికి మద్దతుగా ఈ కార్యక్రమానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయోత్సవ వాతావరణంలో నామినేషన్ ఘట్టాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘట్టంతో మండలంలో ఎన్నికల వేడి ఒక్కసారిగా పరాకాష్ఠకు చేరింది.
Andhra
ముక్కా సాయి వికాస్ రెడ్డి నామినేషన్ ఘట్టం!
Quick Summary:
ముక్కా సాయి వికాస్ రెడ్డి నామినేషన్ ఘట్టం!