జైభీమ్ వాయిస్ టుడే – నందిగామ, అక్టోబర్ 23:
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చింతలపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కురగంటి చిన్న రామయ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పలువురు ప్రముఖులు, న్యాయవాదుల సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సూర్యదేవర రవికుమార్, నందు, న్యాయవాదులు శ్రీరామ్ మూర్తి, కురగంటి కృష్ణంరాజు, నీరుకొండ చంద్రశేఖరరావు, కామాస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న రామయ్యకు మద్దతు తెలిపిన నాయకులు, ఆయన విజయానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. చింతలపాడు ఎంపీటీసీ స్థానంలో ఆయన గెలుపు కోసం సమష్టిగా పనిచేస్తామని తెలిపారు.
Andhra
చింతలపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కురగంటి చిన్న రామయ్య నామినేషన్
Quick Summary:
చింతలపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కురగంటి చిన్న రామయ్య నామినేషన్
