రైల్వే కోడూరులో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమరం
రైల్వే కోడూరు అక్టోబర్ 6 జై భీమ్ వాయిస్ టుడే:
క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, రాజకీయ వ్యూహాలు-భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశానికి రంగం సిద్ధమైంది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కడప పట్టణాభివృద్ధి సంస్థ (కూడా) అధ్యకషులు ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వంలో బుధవారం (అక్టోబర్ 7) ఉదయం 10 గంటలకు స్థానిక రాజ్ సమావేశ ప్రాంగణంలో ఈ ముఖ్య సమావేశం జరగనుంది.
రాబోయే రోజుల్లో రాజకీయ కార్యాచరణను వేగవంతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం, అలాగే ఐదు మండలాల పరిధిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే ధ్యేయంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుండి బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ వేదిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాల ముఖ్యాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి. ఈ సమన్వయ భేటీతో నియోజకవర్గ తెలుగుదేశం వర్గాల్లో నూతన ఉత్సాహం వ్యక్తమవుతోంది.
Andhra
రైల్వే కోడూరులో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమరం
Quick Summary:
రైల్వే కోడూరులో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమరం