సచివాలయ ఉద్యోగుల అరెస్టులు తీవ్ర అప్రజాస్వామికం: తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఆగ్రహం
రైల్వే కోడూరు సెప్టెంబర్ 27 జై భీమ్ వాయిస్ టుడే:
తమ న్యాయమైన హక్కుల సాధన కోసం శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం, నిర్బంధించి అరెస్టులు చేయడం తీవ్ర అప్రజాస్వామికమని రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణి పట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
సమస్యల పరిష్కారాన్ని కోరుతూ "చలో విజయవాడ" పిలుపులో భాగంగా తరలివచ్చిన ఉద్యోగ బాధితులను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం, విజయవాడ ధర్నా చౌక్ వద్ద శాంతియుత ప్రదర్శనలను లాఠీచార్జీలతో విచ్ఛిన్నం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గ్రామ పరిపాలనా వ్యవస్థలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, బకాయి వేతనాల విడుదల, ప్రొబేషన్ ఖరారు, సేవా నిబంధనల రూపకల్పన, అదనపు పనిభారం తొలగింపు, పదోన్నతులు వంటి మౌలిక అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోగా, వారి హక్కుల పోరాటాన్ని అణచివేయాలని చూడటం దారుణమన్నారు.
బలప్రయోగం, అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ఉద్యోగుల ఆందోళనను గమనించి తక్షణమే వారితో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు.
Andhra
సచివాలయ ఉద్యోగుల అరెస్టులు తీవ్ర అప్రజాస్వామికం: తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఆగ్రహం
Quick Summary:
సచివాలయ ఉద్యోగుల అరెస్టులు తీవ్ర అప్రజాస్వామికం: తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఆగ్రహం