పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల ఎంపీటీసీ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేముల నారాయణరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకు పెనుగంచిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా తోటచర్ల గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైకిల్ గుర్తును ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీ అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ టీడీపీ నాయకులు వేముల సైదీశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వేముల వెంకటేశ్వరరావు, పార్టీ బూత్ కన్వీనర్ కుంట ముక్కల ప్రకాష్ (నాని), వేముల సాయి, వేముల తేజ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా
ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి వేముల నారాయణరావు మాట్లాడుతూ, తనకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
Andhra
తోటచర్ల ఎంపీటీసీ అభ్యర్థిగా వేముల నారాయణరావు నామినేషన్
Quick Summary:
తోటచర్ల ఎంపీటీసీ అభ్యర్థిగా వేముల నారాయణరావు నామినేషన్
