మిన్నుముట్టిన గణనాథుని నిమజ్జన సంబరం: రూ. 19 వేలకు ప్రసాద లడ్డు కైవసం
రైల్వేకోడూరు సెప్టెంబర్ 16 జై భీమ్ వాయిస్ టుడే: చిట్వేల్
మండల పరిధిలోని నాగవరం చొప్పవారిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విఘ్నేశ్వరుని నిమజ్జనోత్సవం అత్యంత కోలాహలంగా సాగింది. గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలతో గ్రామం ఆధ్యాత్మిక శోభతో మైమరిచింది. నిమజ్జన ఘట్టానికి ముందు భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం గణనాథుని శోభాయాత్ర భక్తజన సందోహం నడుమ కన్నులపండువగా సాగింది. డప్పు వాయిద్యాల మోతలు, ఆకాశాన్ని తాకే బాణసంచా వెలుగులు, సంగీత హోరు మధ్య యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వసంతాలు చల్లుకున్నారు. ఊరేగింపు పొడవునా గ్రామప్రజలు స్వామివారికి నీరాజనాలు అర్పించారు.
ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన స్వామివారి ప్రసాద లడ్డు వేలం పాట తీవ్ర పోటీ నడుమ సాగగా, గ్రామానికి చెందిన చింతూ దామోదర్ రెడ్డి రూ. 19,000 కు లడ్డును దక్కించుకున్నారు. ఈ సంబరాల్లో ఆకేపాటి ప్రతాపరెడ్డి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఆకేపాటి నరేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, నారం రెడ్డి వెంకట్ రెడ్డి, చెంగల్ రెడ్డి, నర్సా రెడ్డిలతో పాటు గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Andhra
మిన్నుముట్టిన గణనాథుని నిమజ్జన సంబరం: రూ. 19 వేలకు ప్రసాద లడ్డు కైవసం
Quick Summary:
మిన్నుముట్టిన గణనాథుని నిమజ్జన సంబరం: రూ. 19 వేలకు ప్రసాద లడ్డు కైవసం