సీమ నేలపైన పండగ వెలుగులు... ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
నవ రాత్రుల ఆధ్యాత్మిక శోభతో ముస్తాబవుతున్న శుభవేళ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజానీకానికి, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, శ్రమజీవులైన పారిశుద్ధ్య కార్మికులకు, పాత్రికేయులకు అలాగే కూటమి శ్రేణులకు ఓబులవారిపల్లె మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గూనిపాటి చెన్నరాయుడు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అజ్ఞానమనే చీకటిని పారద్రోలి విజ్ఞానమనే వెలుగులను నింపే ఈ పండుగ సమాజంలో సమైక్యతను, సౌభ్రాతృత్వాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. దుర్గాభవాని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటా సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు తులతూగాలని మనసారా కోరుకున్నారు. పండగ దివ్య వాతావరణంలో ప్రజలందరూ భేదాభిప్రాయాలు మరచి ఆనందోత్సవాల మధ్య, సోదరభావంతో దసరా వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Andhra
సీమ నేలపైన పండగ వెలుగులు... ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
Quick Summary:
సీమ నేలపైన పండగ వెలుగులు... ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు