ఓబులవారిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
రైల్వే కోడూరు సెప్టెంబర్ 16 జై భీమ్ వాయిస్ టుడే:
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి పాల్గొని స్థానిక మంగంపేట పరిధిలోని ఓటర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మంగంపేట ప్రాంతంలో ప్రస్తుతం ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గనుల తవ్వకాలు, పునరావాస చర్యల్లో భాగంగా పలు గ్రామాలను ఇప్పటికే ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించి ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే ప్రస్తుతం ప్రజలు నివాసముంటున్న ప్రాంతాలకు, కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు మధ్య తీవ్ర దూరభారం పెరిగిపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, సులభంగా వినియోగించుకోవడమే ప్రాథమిక హక్కని పేర్కొంటూ, స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల రాకపోకలకు అనుకూలంగా ఉండేలా తగిన చర్యలు చేపట్టి ఓటింగ్ శాతాన్ని పెంచేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన యంత్రాంగం ఈ సమస్యను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చింది.
Andhra
ఓబులవారిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
Quick Summary:
ఓబులవారిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
